News August 20, 2025
సౌదీలో స్కై స్టేడియం

FIFA వరల్డ్ కప్-2034 వేళ సౌదీ అరేబియా వినూత్న స్టేడియాన్ని నిర్మించనుంది. సౌదీ నిర్మించబోయే స్మార్ట్ సిటీలో ఇది ఏర్పాటుకానుంది. ది లైన్ అనే స్మార్ట్ సిటీలో ఎడారి తలానికి 350M ఎత్తులో నిర్మించనున్నారు. 46వేల మంది ప్రేక్షకులు కూర్చొనేలా దీనిని రూపొందించనున్నారు. ఇందుకు $1 బిలియన్‌ను ఖర్చు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027లో ప్రారంభించి 2032 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
Similar News
News August 21, 2025
రాత్రి కాఫీ తాగితే ఇంత ప్రమాదమా?

రాత్రులు కాఫీ తాగితే ఎంతో ప్రమాదమని టెక్సస్ యూనివర్సిటీ <
News August 21, 2025
ఏది ఏమైనా టిడ్కో ఇళ్లు కట్టిస్తాం: నారాయణ

AP: లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గందరగోళం అయ్యింది. పెండింగ్ బిల్స్ రూ.3,664 కోట్లు, కాంట్రిబ్యూషన్ రిటర్న్‌కి రూ.370కోట్లు, ఇళ్లు కట్టడానికి రూ.2,100 కోట్లు కావాలి. 83,072 ఇళ్లు రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి మరో లక్ష ఇళ్లు, మిగిలినవి వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారు’ అని తెలిపారు.
News August 20, 2025
పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం ఆదేశాలు

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని సూచించారు.