News August 31, 2024

హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే: సీఎం రేవంత్

image

TG: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

Similar News

News November 25, 2025

కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

image

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.

News November 25, 2025

వినూత్న నిరసన.. ఉల్లిగడ్డలకు అంత్యక్రియలు

image

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మాండ్సౌర్ జిల్లాలోని ధమ్నార్‌లో ఉల్లిగడ్డలను పాడెపై పేర్చి అంత్యక్రియలు చేశారు. దేశంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న మాల్వా-నిమర్‌లో కేజీ రూపాయి పలుకుతున్నట్లు వాపోయారు. పండించేందుకు రూ.10-12 ఖర్చు అవుతుందని, ధరలు తగ్గడంతో నష్టాలే మిగులుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.