News April 4, 2025

SKZR: ఇద్దరి బైండోవర్.. రూ.2లక్షల జరిమానా

image

కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన యెనాం రాజు దేశీదారు అమ్ముతూ, ఈస్గం గ్రామానికి చెందిన సాయిరి రమేష్ బెల్లం రవాణ చేస్తూ పట్టుబడ్డారు. వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి కాగజ్‌నగర్‌ తహశీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేశారు. కానీ మళ్లీ వారు దేశీదారు, బెల్లము అమ్ముతూ పట్టుబడగా కాగజ్‌నగర్ తహశీల్దార్ కిరణ్ ఆ ఇద్దరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు.

Similar News

News December 10, 2025

పరిటాల సునీతపై ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం

image

ప్రజలను ఉద్దరిస్తారని గెలిపిస్తే, దోపిడీ చేసుకునేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు ఫీలవుతున్నారా? అని MLA పరిటాల సునీతను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ‘భర్త నాలుగు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యే అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేదు. మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగండి’ అని డిమాండ్ చేశారు. రామగిరి MPP ఎన్నికను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించారు.

News December 10, 2025

ఎండినవారికి ఇనుము తిండి

image

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.

News December 10, 2025

గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

image

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.