News April 24, 2025
SKZR: ‘కొడుకు పుట్టడం లేదని భార్యను చంపాడు’

కొడుకు పుట్టడం లేదని భార్యను భర్త చంపిన సంఘటన కాగజ్‌నగర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వంజరి గ్రామానికి చెందిన జయరాం కొడుకు కోసం బానక్కా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో బుధవారం రాత్రి గొడవ జరిగింది. బానక్కను కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 25, 2025
వరంగల్: షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

వరంగల్ షీటీం పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై ఈరోజు అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వారు విద్యార్థినిలకు వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News April 25, 2025
ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News April 25, 2025
మరిపెడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని పూల బజార్‌కు చెందిన వంశీ(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కాలువ ఒడ్డు ప్రాంతంలో బైక్, ఆటో ఢీ కొనడంతో వంశీ మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం మరిపెడలో అంత్యక్రియలు జరగనున్నాయి.