News March 29, 2025

SKZR: దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

image

కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఎల్ఐఎం సీఈవో ఆధ్వర్యంలో బీడీఎల్ సహకారంతో వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లు, కృత్రిమ అవయవాలను ఎమ్మెల్యే హరీశ్ బాబు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 100 మందికి పైగా చేయూతనివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 16, 2025

మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

image

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

‘కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి’

image

కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల, ఇప్పటికే జరిగిన ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం అనువుగా లేనందున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో స్థలాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్కడ త్వరగా సర్వే చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలన్నారు.

News September 16, 2025

వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

image

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.