News April 8, 2025
SKZR: దేశంలో నియంతృత్వ పాలన: MLC

కాగజ్‌నగర్ మార్కెట్ ఏరియాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడారు. దేశంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగుతున్న బీజేపీ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 22, 2025
ఆలయాల్లో ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి: ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర

VJA: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇతర ఆలయ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్నాన ఘాట్లు, రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయం, మహిళలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.
News October 22, 2025
జగిత్యాల: తీవ్ర జ్వరంతో ఏడేళ్ల చిన్నారి మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల రవి కుమార్తె హృదయశ్రీ(7) తీవ్ర జ్వరంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. పది రోజులుగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే హృదయశ్రీ మృతిచెందడంతో మల్యాల గ్రామంలో విషాదం నెలకొంది.
News October 22, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా చెక్‌పోస్టులు మూసివేత

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణా చెక్‌పోస్టులు మూతపడనున్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులను, కార్యాలయాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఏసీబీ దాడుల్లో అవినీతి బయటపడిన ముత్తగూడెం, పాల్వంచ చెక్‌పోస్టులతో సహా అన్ని కేంద్రాలు మూతపడనున్నాయి.