News April 8, 2025

SKZR: దేశంలో నియంతృత్వ పాలన: MLC

image

కాగజ్‌నగర్ మార్కెట్ ఏరియాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడారు. దేశంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగుతున్న బీజేపీ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 22, 2025

నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

image

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

News April 22, 2025

రెండు బైకులు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

image

ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.ఈ ఘటన సోమవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  గోపాల్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలుకావడంతో తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబీకులు వెల్లడించారు.

News April 22, 2025

శ్రీకాకుళం: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

image

శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!