News April 4, 2025

SKZR: నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్ల రద్దు

image

నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. బెల్లంపల్లి రేచని రోడ్డు మధ్య మూడో రైల్వే లైన్ పనుల కారణంగా భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్లు మంచిర్యాల వరకే నడపనున్నట్లు పేర్కొంది. మిగతా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా తెలిపింది.

Similar News

News November 12, 2025

LLM స్పాట్ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా LLM కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. అడ్మిషన్లు మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామన్నారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తామన్నారు. కాలేజ్ లింక్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లను 17వ తేదీ వరకు చేసుకోవాలని, సీట్ల కేటాయింపు జాబితాను 18న విడుదల చేస్తామని, 19వ తేదీ మ.12 గంటల వరకు కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు.

News November 12, 2025

ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

image

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 12, 2025

HYD: మంచినీరు సరఫరా.. లెక్కల్లోకి రాని 33% నీరు..!

image

మహానగర పరిధిలో జలమండలి మంచి నీరు సరఫరా చేస్తోంది. సరఫరా కోసం దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, భారీగా వ్యయం ఖర్చు చేస్తోంది. అయితే.. నీటిలో 33% లెక్కల్లోకి రాకుండా పోతుంది. ఇది జలమండలిపై ప్రభావం చూపుతుంది. కోట్ల మందికి తాగునీటి సరఫరా చేస్తుండగా, లీకేజీలతో పాటు, HYDలో పలుచోట్ల నీటి లెక్కలు తప్పుతున్నాయి.