News August 5, 2024
SKZR: రోడ్డు ప్రమాద ఘటనలో ఇంటర్ విద్యార్థి మృతి (Update)

దహెగాంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని <<13777263>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొంచవెల్లి గ్రామానికి చెందిన చిప్ప సూరజ్, చౌదరి నవీన్ కాగజ్నగర్ పట్టణానికి వెళ్లి సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద ఆగి ఉన్న మరో బైక్ను ఢీకొన్నారు. చౌదరి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక ఎస్సై తెలిపారు. మృతుడు ఇంటర్ చదువుతున్నాడు.
Similar News
News December 12, 2025
ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 11, 2025
హీరాపూర్: కోడలిపై అత్త విజయం

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 11, 2025
ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్ను సర్పంచ్గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.


