News January 24, 2025

SKZR: ఆత్మీయ భరోసా నిబంధనలు ఎత్తివేయాలి

image

మండలంలోని కోయవాగు గ్రామపంచాయతీలో శుక్రావరం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఆత్మీయ భరోసాపై పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భూమిలేని వారికి ఆత్మీయ భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిందన్నారు. ఉపాధి కూలీలకు మాత్రమే ఆత్మీయ భరోసా వర్తిస్తుందని తెలపడం ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

కడప జిల్లాకు రానున్న శ్రీ చరణి

image

ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి రేపు కడప జిల్లాకు రానున్నట్లు కడప క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. రేపు కడపలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుందని చెప్పింది. అనంతరం స్టేడియంలో ఆమెకు సత్కారం చేయనున్నట్లు పేర్కొంది. ఆమెకు రాజంపేట రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.

News November 6, 2025

MHBD: బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రాంబాబు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య మమత తెలిపిన వివరాలిలా.. 15ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రాంబాబు ఈ మధ్య కాలంలో విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండటంతో పలుమార్లు ఉన్నత అధికారులు హెచ్చరించినా తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న రాంబాబు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News November 6, 2025

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1500 ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) పీవీ కాలనీకి చెందిన సూరపాక రామనాథం(60)ను అదే కాలనీకి చెందిన చెవుల సురేష్ మద్యం మత్తులో కర్రతో కొట్టి చంపారు. కుమారుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. 11 మంది సాక్షులను విచారించగా సురేష్ పై నేరం రుజువు కావడంతో ఈ రోజు శిక్ష పడింది.