News August 30, 2025
చెంపదెబ్బ వీడియో.. శ్రీశాంత్ భార్య ఫైర్

IPL-2008లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన <<17553113>>వీడియోను<<>> మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఇన్‌స్టా వేదికగా ఫైరయ్యారు. ‘లలిత్, మైకేల్ క్లార్క్ ఇలా చేయడం అమానుషం. చౌకబారు ప్రచారాలకు ఎప్పుడో జరిగిన విషయాన్ని లేవనెత్తడమేంటి? అసలు నిజాన్ని బయటపెట్టాలి. ఈ వీడియోతో ఆటగాళ్లు, కుటుంబాన్ని బాధపెట్టిన క్లార్క్, లలిత్‌పై కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.
Similar News
News August 30, 2025
టెన్త్ అర్హతతో 1,266 ఉద్యోగాలు..

ఇండియన్ నేవీలో 1,266 స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 2 వరకు అవకాశం ఉంది. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. 18-25 ఏళ్ల మధ్య వయసుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం కోసం <
News August 30, 2025
BSFలో 1,121 ఉద్యోగాలు.. SEP 23 లాస్ట్ డేట్

BSFలో 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్/మెకానిక్) పోస్టులకు సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, రెండేళ్ల ITI లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులున్న వారు అర్హులు. వయసు జనరల్ అభ్యర్థులకు 18-25, OBC 18-28, SC, STలకు 18-30 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, CBT టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం: ₹25,500-81,100.
వెబ్‌సైట్: <
News August 30, 2025
డిగ్రీ అర్హతతో ఐబీలో 394 జాబ్స్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు <