News April 11, 2025

SLBCలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు

image

అమ్రాబాద్ పరిధి SLBC టన్నెల్లో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ పేర్కొన్నారు. ప్రత్యేక టీంలు ఇందుకు పని చేస్తున్నాయన్నారు.  

Similar News

News October 17, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్‌లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ

News October 17, 2025

SDPT: స్థానిక ఎన్నికలు ఆలస్యం.. ఆశావాహుల్లో నిరుత్సాహం

image

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆశవాహుల్లో నిరుత్సాహం నిండింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల పక్రియ ఆగిపోయింది. దీంతో దసరాకు ముందు జోష్‌లో ఉన్న ఆయా పార్టీల నాయకులు ప్రస్తుతం చల్లబడిపోయారు. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళితే ఎలా అన్న డైలామాలో పడ్డారు. 2018లో 225 స్థానాలు బీసీలకు దక్కగా రిజర్వేషన్లతో 327 స్థానాలు దక్కాయి.

News October 17, 2025

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి

image

గ్రామాలు సుస్థిర అభివృద్ధి దిశగా సాగేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం తిప్పర్తి మండలంలోని కంకణాలపల్లిలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. సుస్థిరమైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.