News April 11, 2025

SLBCలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు

image

అమ్రాబాద్ పరిధి SLBC టన్నెల్లో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలోని ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ పేర్కొన్నారు. ప్రత్యేక టీంలు ఇందుకు పని చేస్తున్నాయన్నారు.  

Similar News

News April 17, 2026

వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

image

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News April 17, 2026

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.