News April 8, 2025
SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు పనులు

అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికుల మృతదేహాల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. మంగళవారం ఉదయం లోకల్ ట్రైన్ శకలాలను బయటకు తరలించడంతోపాటు టన్నెల్‌లో స్టీల్, మట్టి తొలగింపు పనుల్లో రెస్క్యూ బృందాలు వేగం పెంచాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 15, 2025
విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ ఛార్జీలను ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘టారిఫ్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. విమాన టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికులు గమనిస్తే వాటి స్క్రీన్ షాట్లను మాకు పంపించొచ్చు’ అని వివరించారు. డొమెస్టిక్ మార్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ రూట్ల ఛార్జీలనూ మానిటర్ చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.
News December 15, 2025
చిన్నారుల్లో ఊబకాయాన్ని ముందే గుర్తించొచ్చు

ప్రస్తుతం చిన్నారుల్లోనూ ఊబకాయం ముప్పు పెరుగుతోంది. దీన్ని ముందే గుర్తించేందుకు సైంటిస్టులు పాలీజెనిక్ రిస్క్ స్కోర్ టెస్ట్‌ని క్రియేట్ చేశారు. దీనికోసం 50లక్షలకు పైగా జెనెటిక్ డేటాలను పరిశీలించారు. 5ఏళ్లలోపు పిల్లలకు పరీక్ష చేసి వచ్చిన స్కోర్‌తో ఫ్యూచర్‌లో ఒబెసిటీ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల జీవనశైలిలో మార్పులు చేసి ఒబెసిటీ బారిన పడకుండా చూడొచ్చు.
News December 15, 2025
కవ్వాల్‌లో ఆధార్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో అత్యవసర ఆధార్ ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. మంగళవారం కూడా కొనసాగుతుందని జన్నారం పోస్టల్ శాఖ ఏఎస్పీ రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లోని తప్పుల సవరణ, ఫొటో అప్‌డేట్, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మార్పులు వంటి అన్ని ముఖ్య సేవలను తక్షణమే వినియోగించుకోవాలని ఆయన కోరారు.


