News April 1, 2025
SLBCలో వేగంగా పునరుద్ధరణ పనులు

SLBC టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రదేశంలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్ వెలికి తీసిన అనంతరం సొరంగాల్లో ఉపయోగపడే వ్యర్థాలను బయటకు తీసే ప్రక్రియ మరింత వేగంగా కొనసాగుతోంది.
Similar News
News September 17, 2025
ఉండిలో ప్రభుత్వ భూముల పరిశీలన.. చర్యలకు కలెక్టర్ ఆదేశం

ఉండిలోని ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఉండి కూడలి డైవర్షన్ ఛానల్ వద్ద ఇరిగేషన్, పీడబ్ల్యుడీ, జడ్పీ స్థలాలను పరిశీలించిన ఆమె, ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
News September 17, 2025
స్త్రీల ఆరోగ్యమే కుటుంబ బలానికి ఆధారం: నవ్య

కర్నూలు పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, పోషణ్ మాహ్ కార్యక్రమాల్లో బుధవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పరిరక్షణతో కుటుంబ బలోపేతం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. సమతుల్య ఆహారం, యోగా, స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాశనం చేశారు.
News September 17, 2025
ఏలూరు: మోసపూరిత ఫోన్ కాల్స్పై DMHO హెచ్చరిక

ఏలూరు జిల్లాలో ఉద్యోగాలు, ప్రయోగశాలల అనుమతుల పేరుతో కొందరు మోసగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ పీజే అమృతం హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్స్కు తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తామని తెలిపారు.