News March 4, 2025
SLBC టన్నెల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక

SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీరు ఉబికి రావడంతో భారీగా బురద పేరుకుపోయింది. ఈ పరిస్థితి మృతదేహాల వెలికితీత మరింత కష్టతరం చేస్తోంది. నీటి ప్రవాహం నియంత్రించలేకపోతే మరో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Similar News
News December 16, 2025
సిరిసిల్లలో నువ్వా.. నేనా..?

KTR ప్రాతినిధ్యం వహిస్తున్న SRCLలోని గ్రామాల్లో అధిక స్థానాలు గెలిచి ఆయన ఆత్మస్థైర్యంపై దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం MLA ఆది శ్రీనివాస్కు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. దీంతో KTR SRCLలోనే తిష్ఠ వేసి ఎన్నడూ లేనివిధంగా నేరుగా సర్పంచ్ అభ్యర్థులతో విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. ప్రతి GP గెలవాలంటూ చివరకు గ్రామాల్లోని గల్లీ లీడర్లతోనూ మాట్లాడుతున్నారు.
News December 16, 2025
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
VJA: విద్యుత్ బస్సులపై సీఎంతో భేటీ.. వర్కౌట్ అయ్యేనా.?

రాష్ట్రానికి DEC నాటికి రావాల్సిన 750 ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కేంద్ర నిధులు అందలేదు. ప్రైవేట్ సంస్థ కొనుగోలుకు సిద్ధమైనా, ఛార్జింగ్ స్టేషన్లు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల అవసరం ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత AC బస్సుల స్థానంలో వీటిని తేవాలనే కేంద్రం సూచనల మేరకు RTC ఉన్నత అధికారులు నేడు CMతో సమావేశం కానున్నారు. ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చే అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.


