News March 4, 2025

SLBC టన్నెల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక

image

SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీరు ఉబికి రావడంతో భారీగా బురద పేరుకుపోయింది. ఈ పరిస్థితి మృతదేహాల వెలికితీత మరింత కష్టతరం చేస్తోంది. నీటి ప్రవాహం నియంత్రించలేకపోతే మరో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Similar News

News March 16, 2025

M.Pharmacy, M.Tech ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గతేడాది నవంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన M.Pharmacy 1, 2, 4వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21), M.Tech 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. Share It

News March 16, 2025

WPL ఫైనల్: రెండు వికెట్లు తీసిన కడప జిల్లా అమ్మాయి

image

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL) ఫైనల్ శనివారం జరిగింది. ఈ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ తలపడగా ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో మన కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఆర్డీపీపీకి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి డిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడింది. ముందుగా బౌలింగ్‌ చేసి 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 4 బంతులకు 3 పరుగులు చేసింది.

News March 16, 2025

మోపాల్: సూర్యుడిలా వెలిగిపోతున్న చంద్రుడు

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా కాంతులు వెదజల్లుతూ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో అందరిని ఈ దృశ్యం ఆకట్టుకుంది. సూర్యుడు లాగా చంద్రుడు వెలగడం అనేది మొదటిసారిగా చూస్తున్నామని మోపాల్ గ్రామస్థులు తెలిపారు.

error: Content is protected !!