News March 7, 2025

SLBC టన్నెల్ పనులను పరిశీలించిన కల్నల్ 

image

SLBC టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలను మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పర్యవేక్షించారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.

Similar News

News December 8, 2025

సూర్యాపేట: ఎన్నికలు కలిపాయి వారిని..!

image

మొన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేల్చుకున్న వివిధ పార్టీల నాయకులు నేడు ఒక్కటయ్యారు. వైరం మరిచి తమ పార్టీ బలపరిచిన నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తుంగతుర్తి, వెలుగుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కొట్లాడుతున్నాయి. ఆత్మకూరు(S)లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకోగా.. కందగట్లలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఫైట్ చేస్తున్నాయి.

News December 8, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.2°C

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో నస్రుల్లాబాద్ 8.2°C, బొమ్మన్ దేవిపల్లి 8.3, డోంగ్లి 8.4, బీబీపేట 8.6, బీర్కూర్ 8.7, సర్వాపూర్ 8.8, లచ్చపేట, జుక్కల్ 9, ఎల్పుగొండ, గాంధారి 9.3, పుల్కల్ 9.4, బిచ్కుంద 9.6, మాక్దూంపూర్ 9.9, పిట్లం 10°C అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 8, 2025

చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

image

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.