News March 7, 2025
SLBC టన్నెల్ పనులను పరిశీలించిన కల్నల్

SLBC టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలను మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పర్యవేక్షించారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ టన్నెల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.
Similar News
News March 24, 2025
‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
News March 24, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు…!

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం127 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 702 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలకు గరిష్ఠ ధర రూ.6,740 కనిష్ఠ ధర రూ.4,001 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,280, కనిష్ఠ ధర రూ.1767 లభించింది. కందులు గరిష్ఠ ధర రూ.6,771. ఆముదాలకు గరిష్ట ధర రూ.6,319. జొన్నలకు గరిష్ట ధర రూ.4,215 లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 24, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.