News February 23, 2025
SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.
Similar News
News November 15, 2025
NLG: జీతాల అందక 8 నెలలు

నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 నెలలుగా తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలో సుమారు 100 మందికి పైగానే గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 15, 2025
NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
News November 15, 2025
NLG: కుటుంబానికి ఒక్కటే.. అదీ అందడం లేదు!

జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు డీలర్లు సంచులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ షాపుల పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సంచుల్లో ఇవ్వాల్సి ఉండగా చాలా గ్రామాలలో లబ్ధిదారులకు అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ రేషన్ ఇస్తున్నా సంచులు ఇవ్వడం లేదు. అదే విధంగా 6 కిలోలకు ఒక సంచి చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కుటుంబానికి ఒకటి చొప్పున డీలర్లు పంపిణీ చేస్తున్నారు.


