News February 23, 2025

SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

image

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.

Similar News

News March 21, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అలాగే రోడ్లపై సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల విలువైన ప్రాణాలు పోతున్నట్లు చెప్పారు.

News March 20, 2025

NLG: నాలుగేళ్లుగా టీఏ, డీఏలకు అతీగతీ లేదు!

image

జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు నాలుగేళ్ల నుంచి టీఏ, డీఏలకు అతీగతీ లేకుండాపోయింది. గతంలో ప్రతి నెలా రెండు మీటింగ్‌లకు రూ.500 చెల్లించేవారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక సమావేశానికే టీఏ, డీఏ చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఒక్కో అంగన్‌వాడీ టీచరుకు కనీసం రూ.20 వేల వరకు టీఏ, డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక కూరగాయలు, వంట సామగ్రి, గ్యాస్‌ సిలిండర్లకు చెల్లింపులను అసలే పట్టించుకోవడంలేదు.

News March 20, 2025

NLG: 105 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, 6 లైన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేశారు

error: Content is protected !!