News March 14, 2025
SLBC రెస్క్యూ బృందాలకు నిరంతర భోజన సదుపాయం: కలెక్టర్

NGKL జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఫిరంగి, పర్యవేక్షణలో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సహాయక బృందాలకు అందిస్తున్న భోజన సదుపాయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయక బృందాలతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. గత 19 రోజులుగా సహాయక బృందాల కోసం ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భోజన సదుపాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ వివరించారు.
Similar News
News October 22, 2025
తొర్రూరు: మెడికల్ షాపులపై పోలీసుల దాడులు

తొర్రూరులో మెడికల్ షాప్‌పై మంగళవారం పోలీసులు దాడులు చేశారు. ఓ మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 1,296 స్పాస్మో ప్రాక్సీవాన్ ప్లస్, 345 ట్రామడాల్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకొని NDPS చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి హెచ్చరించారు.
News October 22, 2025
గూగుల్ క్రోమ్‌కు పోటీగా ‘అట్లాస్’

గూగుల్ క్రోమ్‌కు పోటీగా OpenAI ‘అట్లాస్’ అనే సొంత వెబ్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. AI చాట్‌బాట్ ChatGPT ద్వారా వరల్డ్‌లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా OpenAI ఎదిగింది. ఇప్పుడు యూజర్లను పెంచుకుని డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూ ఆర్జించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో ‘అట్లాస్’ను లాంచ్ చేయగా త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.
News October 22, 2025
ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.