News March 14, 2025

SLBC రెస్క్యూ బృందాలకు నిరంతర భోజన సదుపాయం: కలెక్టర్

image

NGKL జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఫిరంగి, పర్యవేక్షణలో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సహాయక బృందాలకు అందిస్తున్న భోజన సదుపాయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయక బృందాలతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. గత 19 రోజులుగా సహాయక బృందాల కోసం ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భోజన సదుపాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ వివరించారు.

Similar News

News March 15, 2026

ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

image

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్‌ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శివప్రసాద్‌ తెలిపారు. కొత్త బస్టాండ్‌ నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 15, 2026

పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

image

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.

News March 15, 2026

కర్నూలులో ‘ఆకలి కేక’

image

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.