News March 9, 2025

SLBC వద్ద భయం.. భయం.!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను కట్ చేస్తే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

Similar News

News October 17, 2025

WNP జిల్లాలో TODAY.. టాప్ HEADLINES

image

✔️PBR: బంద్‌ను విజయవంతం చేయాలి.
✔️PNGL: చేపల వలలో చిక్కిన మొసలి.
✔️WNP: ప్రజలకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి.
✔️కెమెరా వంద మందితో సమానం: SP
✔️ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఇండోర్ స్టేడియం.
✔️మునిసిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం.
✔️సైబర్ మోసాల పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: CI.
✔️CPR పై అవగాహనా పెంచుకోవాలి: DMHO.
✔️ బీసీ జెఏసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు.

News October 17, 2025

పెద్దపల్లి కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన

image

పెద్దపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం CPRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO డా.వాణిశ్రీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.ప్రశాంత్ (జనరల్ ఆసుపత్రి, రామగుండం) సీపీఆర్‌పై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. గుండెపోటు సమయంలో ప్రజల ప్రాణాలను సకాలంలో కాపాడవచ్చని అన్నారు. అందరూ సీపీఆర్ నైపుణ్యం నేర్చుకోవాలని డా.వాణిశ్రీ సూచించారు. జిల్లాలోని వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 17, 2025

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారంపై దృష్టి పెట్టండి: KMR SP

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో అనవసరంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు.