News March 9, 2025
SLBC వద్ద భయం.. భయం.!

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News March 26, 2026
విశాఖ: ‘రేపు మాంసం దుకాణాలు మూసివేయండి’

గ్రేటర్ విశాఖ పరిధిలో మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ ఆదేశించింది. మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డా.ఈఎన్‌వి.నరేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని జంతు వధశాలలు కూడా మూసివేయాలని సూచించారు. ఆదేశాలను అతిక్రమించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 26, 2026
బావ కాదు.. రాక్షసుడు!

డబ్బు కక్కుర్తి ఒక నిష్కల్మషమైన పసి <<19480775>>ప్రాణాన్ని<<>> బలి తీసుకుంది. అత్తమామలు డబ్బులు ఇవ్వలేదని యాడికి మం. కోన ఉప్పలపాడుకు చెందిన 5ఏళ్ల హేమచంద్రను సొంత బావ సర్వేశ్ కిరాతకంగా హతమార్చడం కలచివేస్తోంది. తనను ఎత్తుకున్న బావే కాలయముడిలా మారుతాడని ఆ బాలుడు ఊహించి ఉండడు. గుట్టల్లో ఆ పసివాడు ప్రాణ భయంతో ఎంతలా విలవిలలాడాడో తలచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. మనిషిలో ఇంతటి క్రూరత్వమా? అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
News March 26, 2026
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం: సీఎండీ

TGNPDCL పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త చారిత్రక గరిష్ఠ స్థాయిని అందుకుందని సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి వెల్లడించారు. గురువారం సంస్థ పరిధిలో ఏకంగా 6,457 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైందని, ఇది సంస్థ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ఠ డిమాండ్ అని ఆయన తెలిపారు. గత మార్చి 3, 2026 నాడు నమోదైన 6,441 మెగావాట్ల రికార్డు డిమాండ్ సంఖ్యను అధిగమించిందన్నారు.


