News March 9, 2025

SLBC వద్ద భయం.. భయం.!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను కట్ చేస్తే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

Similar News

News March 13, 2026

వరంగల్: పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.20 లక్షలు కాజేసింది!

image

మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళ నమ్మబలికి రూ.20 లక్షలకు పైగా కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేటకు చెందిన సత్యనారాయణకు భూపాలపల్లికి చెందిన మహిళ పరిచయమై పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు మాట్లాడి రూ.20.50 లక్షలు తీసుకుని ఇల్లు తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆమెకు ముందే వివాహమై 15 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలియడంతో బాధితుడు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 13, 2026

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

image

దేశంలో <<19323083>>కల్తీ పాల<<>> ఘటనలు వెలుగు చూస్తుండటంతో FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదారులు, విక్రయదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్/లైసెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించింది. సర్టిఫికెట్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.

News March 13, 2026

GVMC అజెండాలో వివాదాస్పద అంశాలు

image

GVMC స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం నేడు మేయర్ పీలా అధ్యక్షతన జరగనుంది. ప్రధాన అజెండాలో 193 అంశాలు ఉండగా.. టేబుల్ అజెండాగా మరో 60 అంశాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో తిరస్కరించిన బయో టాయిలెట్‌లు, హెలీపాడ్ పనులు, బీచ్‌రోడ్ గ్రిల్స్ పెయింటింగ్ బిల్లులు మళ్లీ చేర్చడం చర్చనీయాంశమైంది. కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు అప్పట్లో రూ.150గా ఉన్న ఖర్చును ఇప్పుడు రూ.1500గా చూపిన బిల్లు కూడా అజెండాలో ఉంది.