News March 4, 2025
SLBC: ఇంకా లభించని కార్మికుల ఆచూకీ

TG: SLBC సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయి 10 రోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా సొరంగం లోపలి పరిస్థితులు అనుకూలించడం లేదు. మట్టి, నీరు తొలగిస్తున్న కొద్ది మళ్లీ వచ్చి చేరుతోంది. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నా ఫలితం లేదు. 2, 3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 4, 2025
భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.87,380లకు చేరింది. అటు వెండి ధర కూడా రూ.2000 పెరిగి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
News March 4, 2025
75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.
News March 4, 2025
నేటి నుంచే టారిఫ్స్.. స్టాక్‌మార్కెట్లు బేరిష్

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,044 (-80), సెన్సెక్స్ 72,890 (-210) వద్ద చలిస్తున్నాయి. మెక్సికో, కెనడాపై 25%, చైనాపై 20% టారిఫ్స్ అమల్లోకి రావడం ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆటో, FMCG, ఐటీ, ఫార్మా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. బ్యాంకు, మీడియా షేర్లు రాణిస్తున్నాయి. BEL, SBI, INDUSIND, ICICI BANK టాప్ గెయినర్స్.