News March 24, 2025

SLBC ఘటనపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

image

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పరిధి నాగర్ కర్నూల్ జిల్లా SLBC సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలించింది. కాగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.

Similar News

News March 26, 2025

నల్గొండ: 3 జిల్లాలకు 3 మంత్రి పదవులు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్, బీసీ వర్గం నుంచి బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్, నల్గొండ నుంచి కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఐలయ్యను క్యాబినెట్‌లోకి తీసుకుంటే భువనగిరి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుంది. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా అమాత్య పదవి రేసులో ఉన్నట్లు చర్చ సాగుతుంది.

News March 26, 2025

రేపు ఉప్పల్ వెళుతున్నారా.. ఇది మీ కోసమే!

image

రేపు ఉప్పల్ వేదికగా SRH VS LSG మ్యాచ్ కోసం TGSRTC స్పెషల్ బస్సులను నడుపుతోంది. 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను స్టేడియానికి తిప్పనున్నారు. ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, విధాని, బర్కత్‌పురా, కాచిగూడ, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, మియాపూర్, కంటోన్మెంట్, హఫీజ్‌పేట, రాణిగంజ్, ఫలక్‌నుమా, మెహదీపట్నం, HCU తదితర డిపోల బస్‌లు అందుబాటులో ఉంటాయి.
SHARE IT

News March 26, 2025

BREAKING: సూర్యాపేట డీఎస్పీపై బదిలీ వేటు

image

సూర్యాపేట డీఎస్పీ రవి కుమార్‌పై బదిలీ వేటు పడింది. నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్ డీఎస్పీ రవికుమార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా కోదాడ డీఎస్పీ శ్రీధర్‌ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. 

error: Content is protected !!