News May 20, 2024

లంచగొండులకు నిద్రలేని రాత్రులే

image

గతంలో ఏసీబీకి చిక్కిన అధికారుల గురించి చాలా అరుదుగా వార్తలొచ్చేవి. కానీ ఏడీజీ సీవీ ఆనంద్ ACB చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అధికారులు దూకుడు పెంచారు. ఇవాళ రైతు నుంచి లంచం తీసుకుంటూ కమలాపూర్ MRO మాధవి పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని నానాజిపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికారెడ్డి, బిల్ కలెక్టర్ బాలరాజు రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయండి.

Similar News

News December 4, 2025

పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

image

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్‌ ఫాస్పెట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.

News December 4, 2025

హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.