News July 13, 2024

భారత్-శ్రీలంక షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

image

భారత్-శ్రీలంక షెడ్యూల్‌లో BCCI స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 27 నుంచి T20, వచ్చే నెల 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. 27న తొలి టీ20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది. కాగా ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌లో తొలి T20 ఈ నెల 26న, రెండో T20 27న జరగనున్నట్లు తెలిపింది. తొలి వన్డే ఆగస్టు 1న జరగనున్నట్లు ప్రకటించింది.

Similar News

News December 7, 2025

కొత్తగూడెం: మత్తులో ట్రాక్‌ దాటుతూ రైలు కిందపడి..

image

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News December 7, 2025

అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

image

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.

News December 7, 2025

కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

image

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.