News May 15, 2024

అర్బన్ ఓటింగ్‌లో స్వల్ప పెరుగుదల

image

TG: గ్రేటర్ పరిధిలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్‌లో స్వల్ప పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం కాగా ఈసారి 48.48శాతం, సికింద్రాబాద్ 46.50 శాతం కాగా ఈసారి 49.04శాతం, మల్కాజిగిరిలో 49.63శాతం కాగా ఇప్పుడు 50.78శాతం, చేవెళ్లలో 53.25శాతం నుంచి ఇప్పుడు 56.40శాతానికి ఓటింగ్ పెరిగింది. స్వల్ప పెరుగుదలే అయినా తమకు అనుకూలమవుతుందని అన్ని పార్టీలూ నమ్మకంగా చెబుతుండటం ఆసక్తికరం.

Similar News

News March 20, 2026

రోడ్లపై ఉమ్మినందుకు ₹3.44 లక్షల ఫైన్!

image

లండన్‌లోని రోడ్లపై పాన్ ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు అధికారులు ₹3.44 లక్షల జరిమానా విధించారు. గతేడాది జూన్‌లో కింగ్స్‌బరీ రోడ్డులో అక్షిత్ కుమార్, నార్త్ వెంబ్లే స్టేషన్ వద్ద హితేశ్ పటేల్ ఉమ్మేశారు. దీంతో వారికి 100 పౌండ్ల(₹12,533) చొప్పున అధికారులు స్పాట్ ఫైన్ వేశారు. కానీ వాళ్లు చెల్లించకపోవడంతో 1,391 పౌండ్ల(₹1.72 లక్షలు) చొప్పున ఫైన్ వేస్తూ బ్రెంట్ కౌన్సిల్‌ ఆదేశాలిచ్చింది.

News March 20, 2026

హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

image

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.

News March 20, 2026

నేడే రాష్ట్ర బడ్జెట్

image

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.