News October 21, 2024

స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.

Similar News

News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 21, 2024

రైలులో టపాసులు తీసుకెళ్లొచ్చా?

image

దీపావళి సమీపిస్తోంది. చాలామంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఈక్రమంలోనే బాణసంచా కొని ట్రైన్‌లో తీసుకెళదామనుకుంటారు. అయితే రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం మండే స్వభావం ఉన్న ఫైర్ క్రాకర్స్‌ను రైలులో తీసుకెళ్లడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ స్టవ్స్, సిలిండర్స్, యాసిడ్స్ వంటివి కూడా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.