News March 28, 2025

SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

image

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News April 3, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్‌హెచ్ఓ

image

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎం‌అండ్‌హెచ్‌ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్‌‌లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 3, 2025

సరుబుజ్జిలి: నాలుగు నెలల్లో 4 ఉద్యోగాలు

image

సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వాకముల్లు రమణమూర్తి కుమారుడు బాలమురళి B.TECH పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. 2025 సంవత్సరంలో విడుదలైన రూరల్ బ్యాంక్(RRB) PO, క్లర్క్ ఫలితాల్లో ఉత్తీర్ణుడై చైతన్య గోదావరి బ్యాంక్‌లో పీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన IBPS క్లర్క్, RPF ఎస్ఐగానూ కూడా ఎంపికయ్యారు. 4 ఉద్యోగాలు సంపాదించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News April 3, 2025

జలుమూరు: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

image

జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఎంపైర్‌గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు.

error: Content is protected !!