News April 4, 2025
రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలు ప్రారంభం

AP: రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని నెలాఖరు నుంచి దశల వారీగా అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 10, 2025
GOOD NEWS: వడ్డీ రేట్లు తగ్గించిన 4 బ్యాంకులు

రెపో రేటును RBI O.25 శాతం మేర తగ్గించడంతో పలు బ్యాంకులు కూడా అదే బాట పట్టాయి. ఇండియన్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు రుణాలపై వడ్డీ రేట్లను 0.35 శాతం మేర కుదించాయి. సవరణ తర్వాత PNB, BOI వడ్డీ రేట్లు 9.10% నుంచి 8.85%కు, ఇండియన్ బ్యాంక్ 9.0% నుంచి 8.7%కు, UCO బ్యాంక్ 8.8 శాతానికి తగ్గుతాయి. కాగా ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపునకు యోచిస్తున్నాయి.
News April 10, 2025
రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ

AP: వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.
News April 10, 2025
‘రామాయణం’లో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తున్నట్లు సన్నీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవును నేను హనుమంతుడి పాత్ర చేస్తున్నా. నటులుగా మేము సవాళ్లతో కూడిన పాత్రలను ఇష్టపడతాం. ఎందుకంటే అది సరదాగా ఉంటుంది. ప్రజలు మెచ్చేలా నేను ఆ పాత్రలో లీనమైపోతా. నేను ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇది ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని ఆయన తెలిపారు.