News January 22, 2025

రేపటి నుంచి స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ

image

తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. SSD టోకెన్ల జారీపై అధికారులతో TTD EO సమీక్షించారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.

Similar News

News January 20, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.

News January 20, 2026

72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

image

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 20, 2026

అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

image

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్‌లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్‌లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.