News July 27, 2024

SLvsIND: సంజూకు చోటు కష్టమే?

image

SLvsIND టీ20 సిరీస్‌ ఈరోజు రాత్రి నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. తుది జట్టు అంచనా చూస్తే సంజూ శాంసన్‌కు చోటు కష్టంలాగే కనిపిస్తోంది. కీపర్‌గా పంత్‌వైపే భారత్ మొగ్గు చూపడం, మిగిలిన స్థానాలకు కూడా తగిన ఆటగాళ్లుండటంతో శాంసన్‌ను ఆడించకపోవచ్చని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో సంజూ ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడిపై ఎందుకీ వివక్ష అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News January 21, 2026

రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

image

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.

News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

News January 21, 2026

జనవరి 21: చరిత్రలో ఈరోజు

image

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం