News October 8, 2024
చిన్న పార్టీలు కాంగ్రెస్ కొంపముంచాయి

హరియాణాలో BJP, కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.85% మాత్రమే కావడం గమనార్హం. BJP 48 స్థానాల్లో గెలుపొంది 39.94% ఓట్లు సాధించింది. అయితే, 37 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ 39.09% ఓట్లు సాధించింది. కేవలం 0.85% ఓట్ల వ్యత్యాసంతో BJP కంటే 11 స్థానాలు వెనుకబడిపోయింది. INLD, ఆప్, BSP, JJPలు 7.75% ఓట్లు, ఇతరులు 11% ఓట్లు చీల్చారు. దీంతో రెబల్స్, చిన్న పార్టీలు కాంగ్రెస్ కొంపముంచాయి.
Similar News
News December 5, 2025
కామారెడ్డి: 10 సర్పంచి స్థానాలు, 433 వార్డు స్థానాలు ఏకగ్రీవం

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, 433 వార్డులు ఏకగ్రీవమైనట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళీ శుక్రవారం వెల్లడించారు.
News December 5, 2025
ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
News December 5, 2025
CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీలకం కానుందని INC పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగమయ్యే వారికి సమ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.


