News August 22, 2025
ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

AP: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
Similar News
News August 22, 2025
రూ.300 కోట్ల దిశగా ‘మహావతార్ నరసింహ’

హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 5వ వారంలోనూ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.278 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ గత నెల 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది.
News August 22, 2025
సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారు.. షా తీవ్ర ఆరోపణలు

‘INDI’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన ‘సల్వాజుడుం’కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయుంటే 2020కి ముందే నక్సలిజం అంతమయ్యేదని కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందని విమర్శించారు.
News August 22, 2025
త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు

AP: తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమకానున్నాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఇకపై ఏటా DSC నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.