News December 13, 2025

SMAT: నలుగురు క్రికెటర్లు సస్పెండ్

image

SMATలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో క్రికెటర్లు అమిత్, అహ్మద్, అమన్, అభిషేక్‌ను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ACA) సస్పెండ్ చేసింది. ఆపై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది. విచారణ పూర్తయ్యే వరకూ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారిని ఆదేశించింది. వీళ్లు SMATలో ప్లేయర్లను ప్రభావితం చేసి అవినీతికి ప్రేరేపించినట్లు ఆరోపణలున్నాయి. అటు అస్సాం జట్టు SMAT సూపర్ లీగ్ దశకు చేరలేదు.

Similar News

News December 13, 2025

బస్సుల్లో పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడండి: NMUA

image

AP: స్త్రీశక్తి పథకంతో RTCకి డిమాండ్ పెరిగిందని NMUA వెల్లడించింది. బస్సులు ఎక్కుతున్న మహిళలు ఎంతశాతమో తెలిసింది కాబట్టి టికెట్ ఇచ్చే విధానం మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. రద్దీ వల్ల మహిళల ఆధార్ చెక్ చేసి టికెట్ ఇవ్వడంలో కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. అందువల్ల కేవలం పురుషులకే టికెట్లు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలంది.

News December 13, 2025

పెరిగిన చలి.. వరి నారుమడి రక్షణకు చర్యలు

image

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.

News December 13, 2025

19 అమావాస్యలు ఇలా చేస్తే…?

image

కూష్మాండ దీపాన్ని అమావాస్య/అష్టమి రోజు వెలిగించాలి. మొత్తం 19 అమావాస్యలు/19 అష్టములు ఈ దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజానంతరం ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే గ్రహ వాస్తు పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. జనాకర్షణ, ధనయోగం కోసం ఈ పరిహారాన్ని పాటిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కాల భైరవుడిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకొని ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు.