News July 15, 2024

నేడు విచారణకు స్మిత సభర్వాల్, వికాస్‌రాజ్!

image

TG: ‘కాళేశ్వరం’పై న్యాయవిచారణ చేస్తున్న PC ఘోష్ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఐఏఎస్‌లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి సమాచారం ఇచ్చింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేసిన స్మితా సభర్వాల్, ఆ శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన వికాస్‌రాజ్ నేడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. వీరి తర్వాత రామకృష్ణారావు, రజత్‌కుమార్, ఎస్కే జోషి నుంచి కమిషన్ వివరణ కోరనుంది.

Similar News

News November 17, 2025

గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

image

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

image

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్‌ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.

News November 17, 2025

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

image

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.