News July 23, 2024
స్మిత వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి సీతక్క

TG: ఇతరుల సమర్థతను గుర్తించకపోవడమే మానసిక వైకల్యమని మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగులను కించపరిచేలా స్మితా సబర్వాల్ చేసిన <<13679127>>వ్యాఖ్యలను<<>> CM దృష్టికి తీసుకెళ్తామన్నారు. ‘స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్, బ్రెయిలీ లాంటి వాళ్ల గురించి ఆమెకు తెలియదా? దివ్యాంగులైన ఎంతోమంది IASలు ఉన్నత పదవులు అలంకరించారు’ అని అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడారు.
Similar News
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <
News November 22, 2025
అద్దం పగిలితే అపశకునమా?

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.


