News December 27, 2024
భారత్‌పై స్మిత్ రికార్డు
టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.
Similar News
News December 27, 2024
MPDOపై దాడి.. పవన్ కళ్యాణ్ ఆగ్రహం
AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO శ్రీ జవహర్ బాబుపై YCP నేత సుదర్శన్ చేసిన దాడిని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావు లేదని స్పష్టం చేశారు. అటు రేపు కడప రిమ్స్‌కు వెళ్లనున్న పవన్ బాధిత MPDOను పరామర్శిస్తారు.
News December 27, 2024
త్వరగా నిద్ర రావాలంటే ఇలా చేయండి!
ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT
News December 27, 2024
2024లో ఒక్క నిమిషంలో ఏం జరిగిందంటే?
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో సగటున ప్రతి నిమిషంలో ఏం జరిగిందో తెలిపే డేటా వైరలవుతోంది. ఒక్క నిమిషంలో గూగుల్‌లో 5.9M సెర్చులు, 10.41 లక్షల ప్రశ్నలకు సిరి జవాబివ్వడం, యూట్యూబ్‌లో 34.72 లక్షల వ్యూస్, 18.8 మిలియన్ల టెక్స్ట్ మెసేజ్‌లు, ఇన్‌స్టా& ఫేస్‌బుక్‌లో 138.9M వ్యూస్, 251.1 మిలియన్ల మెయిల్స్, 9వేల మంది లింక్డ్‌ఇన్‌లో జాబ్ అప్లికేషన్లు నమోదైనట్లు డేటా తెలిపింది.