News October 14, 2024
బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న స్మృతీ ఇరానీ!

మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్ర పోషించారు. అయితే ఆమె కమ్‌బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.
Similar News
News February 8, 2026
రాత్రిపూట ఈ ఒక్క అలవాటు మార్చుకోండి.. మీ గుండె సేఫ్!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు నిద్రపోయామనే దానికంటే ఏ టైమ్‌కి పడుకున్నామన్నదే చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. ‘స్లీప్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో వచ్చిన స్టడీ ప్రకారం.. రోజూ ఒకే టైమ్‌కు నిద్రపోయే అలవాటు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 15రోజులు రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి పడుకుంటే BP తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ చిన్న మార్పుతో హైపర్ టెన్షన్ సమస్యకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.
News February 8, 2026
అమెరికాపై భారత్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. USAతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా ఛేదనలో తడబడింది. బౌలింగ్‌లో మెప్పించినా బ్యాటింగ్‌లో తేలిపోయింది. శుభం(37), సంజయ్ కృష్ణమూర్తి(37), మిలింద్(34) మినహా ఎవరూ రాణించలేకపోయారు. IND బౌలర్లలో సిరాజ్ 3, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.
News February 7, 2026
భారత్‌లోకి GM పంటలు? USతో డీల్‌పై RSS అనుబంధ సంస్థ ఫైర్!

USతో ట్రేడ్ డీల్‌లో భాగంగా తక్కువ ధరకు DDGS దిగుమతులను అనుమతించడంపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది జన్యుమార్పిడి (GM) పంటలను భారత్‌లోకి దొడ్డిదారిలో ప్రవేశపెట్టే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. దీనివల్ల దేశీయ సోయాబీన్ రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. RSS అనుబంధ BKS మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.


