News June 23, 2024

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

సౌతాఫ్రికా-Wతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా-W స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చెలరేగారు. 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్‌ప్రీత్(3,565) ఉన్నారు. కాగా ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో మంధాన సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 54

image

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ఎవరు?
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరేంటి?
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ఎవరు?
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ఏమంటారు?
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ఏమిటి?
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 2, 2025

అన్మోల్‌కు అందించే ఆహారం ప్రత్యేకం

image

అన్మోల్ సంరక్షణ కోసం రోజువారీ మెనూలో 250 గ్రాముల బాదం, 30 అరటిపండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 కిలోల పాలు, 20 గుడ్లు ఉన్నాయి. అదనంగా ఆయిల్ కేక్, పశుగ్రాసం, నెయ్యి, సోయాబీన్స్, మొక్కజొన్నను ఇస్తారు. ఇవన్నీ దాని శరీరాకృతిని, సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడం కోసమేనని దాని యజమాని గిల్ తెలిపారు. దీనికి రోజూ 2 సార్లు స్నానం చేయించి.. బాదం, ఆవ నూనెల ప్రత్యేక మిశ్రమంతో దాని శరీరాన్ని మర్దనా చేస్తారు.

News November 2, 2025

కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

image

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్‌ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.