News June 5, 2024
ఓడినా.. తగ్గేదేలే అంటున్న స్మృతి

ఓటమి తర్వాత ‘హౌ ఈజ్ ద జోష్ అంటే హై సర్’ అనే అంటానని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. అమేథీలో కేఎల్ శర్మ ఆమెపై 1.6 లక్షల ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ‘జీవితమంటే ఇంతే. పదేళ్లలో గ్రామగ్రామాన తిరిగాను. రోడ్లు, కాలువలు, బైపాస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇళ్లు కట్టించాను. ఏదేమైనా గెలుపు, ఓటముల్లో నాకు అండగా ఉన్న అందరికీ రుణపడి ఉంటాను. వేడుకలు చేసుకుంటున్న వారికి అభినందనలు’ అని ఆమె అన్నారు.
Similar News
News September 10, 2025
ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఇలా మారుతుంది!

ఎక్కువ మోతాదులో, దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సేవించిన ఆల్కహాల్ దాదాపు కాలేయం ద్వారానే జీర్ణమవుతుందని, ఈ ప్రక్రియలో ఇది అనేక రసాయనాలను విడగొడుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో మద్యం తాగే వారిని హెచ్చరించేందుకు ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఫొటోను షేర్ చేశారు.
News September 10, 2025
రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.