News December 8, 2024

‘పుష్ప’ తరహాలో బంగాళదుంపల స్మగ్లింగ్

image

పశ్చిమ బెంగాల్‌లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Similar News

News November 22, 2025

ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

image

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్‌రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.

News November 22, 2025

‘RRR’పై రీసర్వే చేయండి.. గడ్కరీకి కవిత లేఖ

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌పై రీసర్వే చేయాలని కోరుతూ కేంద్రమంత్రి గడ్కరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. ‘రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని గ్రామాల్లో అలైన్‌మెంట్‌ను చాలాసార్లు <<18295771>>మార్చారు<<>>. రాజకీయ నేతలు, భూస్వాముల కోసం ఇలా చేశారని స్థానికులు నమ్ముతున్నారు. చిన్న రైతులే నష్టపోతున్నారు’ అని పేర్కొన్నారు. రీసర్వే చేసి, అలైన్‌మెంట్ ఖరారుకు ముందు స్థానికులతో చర్చించాలని కోరారు.

News November 22, 2025

పైరసీని ఎలా ఆపాలి?.. RGV సలహా ఇదే

image

భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్‌ RGV ట్వీట్ చేశారు. పైరసీ ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదని పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని అభిప్రాయపడ్డారు. “సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది అంటున్నారు. మరి నగలు ఖరీదుగా ఉంటే దుకాణాన్ని దోచుకుంటామా?” అని ప్రశ్నించారు. పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చేవారితో పాటు వాటిని చూస్తున్నవారిని కూడా శిక్షించాలని సూచించారు.