News November 23, 2024
విమానాలు లేటైతే ప్యాసింజర్లకు స్నాక్స్, వాటర్!

ఎయిర్‌లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్‌లైన్ సంస్థలు త్రాగు నీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 19, 2025
త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను నియంత్రించేలా డిసెంబర్లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.
News November 19, 2025
ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట

మాసిన బట్టలు ధరించి, పరిశుభ్రత పాటించనివారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అమితంగా తినేవారి దగ్గర, బద్ధకంగా ఉండే వ్యక్తులు దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర ధనం నిలవదని అంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పడుకునేవారు ఎంతటి గొప్పవారైనా వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని తెలుపుతున్నారు. ఒకవేళ వీరి వద్ద సంపద ఉన్నా, అది ఎక్కువ రోజులు నిలవదని పేర్కొంటున్నారు.
News November 19, 2025
భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.


