News July 30, 2024
పాము కాటు మరణాలు భారత్లోనే అత్యధికం: బీజేపీ ఎంపీ

పాము కాటు కారణంగా భారత్లో ఏటా 50వేల మంది మరణిస్తున్నారని BJP MP రాజీవ్ ప్రతాప్ రూఢీ లోక్సభలో గుర్తుచేశారు. ఈ మరణాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ‘ఏటా 40 లక్షలమంది వరకు పాముకాటుకు గురవుతున్నారు. 50వేలమంది వరకు చనిపోతున్నారు. సత్వర చికిత్స అందినవారు బతుకుతుండగా, అవగాహన లేనివారు బలవుతున్నారు. కాటుకు గురైనవారిని వెంటనే రక్షించే వ్యవస్థను భారత్ అభివృద్ధి చేయాలి’ అని కోరారు.
Similar News
News December 1, 2025
‘108’ సంఖ్య విశిష్టత

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in
News December 1, 2025
పంచాయతీలో ‘నోటా’.. మెజార్టీ ఓట్లు వచ్చినా?

TG: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)ను ప్రవేశపెట్టారు. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ విధానం ఉంది.


