News March 27, 2024
ఆ సినిమాలో హీరోయిన్ స్నేహ కాదు: శ్రీను వైట్ల

20 ఏళ్ల క్రితం విడుదలైనప్పటికీ నేటికీ తాజాగా అనిపించే సినిమా వెంకీ. రవితేజ, స్నేహ జంటగా నటించిన ఈ మూవీలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. తొలుత అందులో హీరోయిన్ స్నేహ కాదని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. ‘ముందుగా అసిన్‌ను తీసుకోవాలని భావించాం. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో స్నేహను తీసుకున్నాం. ట్రైన్ సీన్‌లోనూ ఎంఎస్ నారాయణను అనుకున్నాం గానీ అదీ కుదరలేదు’ అని వెల్లడించారు.
Similar News
News February 24, 2026
అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్

TG: అంగన్వాడీ టీచర్లను ప్రీ స్కూల్ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,000+ మంది అంగన్వాడీ టీచర్లు ఉండగా, ఇందులో ఇంటర్ అర్హత ఉన్న 17,600 మందికి తొలుత శిక్షణనివ్వనున్నారు. ఈ 6 నెలల స్పెషల్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులో 6 రోజులపాటు ఆఫ్‌లైన్ ట్రైనింగ్, 30 గంటలపాటు ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయి.
News February 24, 2026
‘వాహన్’ పోర్టల్‌లోకి తెలంగాణ.. అన్నీ ఆన్‌లైన్‌లోనే!

TG: కేంద్రం తీసుకొచ్చిన ‘వాహన్’ పోర్టల్‌లో మార్చి 15న చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఈ పోర్టల్‌లో పొందవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొన్నా అమ్మినా ఇక నుంచి ఓనర్ పేరు, అడ్రస్ మార్పులకు RTA ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ హిస్టరీ, డూప్లికేట్ RC వంటివి ఇందులో పొందే అవకాశం ఉంటుంది.
News February 24, 2026
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా?

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్‌స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అవడమే ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్ మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.


