News January 4, 2025
ఢిల్లీని కమ్మేసిన మంచు.. 470 విమానాలు ఆలస్యం
దేశ రాజధానిని పొగమంచు దట్టంగా కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎదుటి వ్యక్తి కనిపించనంత తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే 470 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. పౌరులు బయట తిరిగేందుకు భయపడే స్థాయిలో పొగ కమ్ముకోవడం గమనార్హం. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
Similar News
News January 6, 2025
ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా
ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.
News January 6, 2025
శుభ ముహూర్తం (06-01-2025)
✒ తిథి: శుక్ల సప్తమి రా.7:03 వరకు ✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.25 వరకు ✒ శుభ సమయం: ఉ.5.46-6.22, సా.6.58-7.22 ✒ రాహుకాలం: ఉ.7.30-9.00 ✒ యమగండం: ఉ.10.30-మ.12.00 ✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34 ✒ వర్జ్యం: ఉ.6.44-8.15 ✒ అమృత ఘడియలు: సా.4.51-6.22.
News January 6, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 6, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు ✒ ఇష: రాత్రి 7.13 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.